GAYATRI GAYATRI

గాయత్రీరామాయణం 2

Sacred recitation and chant for invocation and blessings of GAYATRI.

గాయత్రీరామాయణం 2

Stotra Lyrics

గాయత్రీరామాయణం 2

(గాయత్రీమంత్ర అక్షరాణాం(వర్ణానాం) శ్రీమద్ వాల్మీకిరామాయణే సంక్షేపరామాయణే ప్రదర్శితాః)

శ్రీమద్ బాలకాండే ప్రథమసర్గాదౌ - 1-1-1

తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరం .  (అత్ర తకారః గాయత్రీ ప్రథమాక్షరం- త)

నారదం పరిపప్రచ్ఛ వాల్మికిర్మునిపుంగవం .. 1..

శ్రీమద్ బాలకాండే త్రింశే సర్గే -1-30-18(19)

స తేన పరమాస్త్రేణ మానవేన సమాహతః .  (అత్ర సకార గాయత్రీ ద్వితీయక్షరం -స)

సంపూర్ణం యోజనశతం క్షిప్తః సాగరసంప్లవే .. 2..

శ్రీమద్ బాలకాండే త్రిషష్టితమే సర్గే -1-63-3 -4

విశ్వామిత్రో మహాతేజా భూయస్తేపే మహాతపాః .  (అత్రతృతీయాక్షరం -వి)

తతః కాలేన మహతా మేనకా పరమాప్సరః .. 3..

అయోధ్యా కాండే చతుర్దశే సర్గే -2-14-36

చతురశ్వో రథః శ్రీమాన్ నిస్త్రింశో ధనురుత్తమం .  (అత్రచతుర్థాక్ష్రం - తు)

వాహనం నరసంయుక్తం ఛత్రం చ శశిసన్నిభం .. 4..

అయోధ్యా కాండే చతుశ్చత్వారింశే సర్గే- 2-44-5

వర్తతే చోత్తమాం వృత్తిం లక్ష్మణోఽస్మిన్ సదాఽనఘః .  (అత్రగాయత్ర్యా పంచమాక్షరం -వ)

దయావాన్ సర్వభూతేషు లాభస్తస్య మహాత్మనః .. 5..

అయోధ్యా కాండే ఏకసప్తతితమే సర్గే -2-71-33

ద్వారేణ వైజయంతేన ప్రావిశచ్ఛ్రాంతవాహనః .  (అత్రరే ఇతి షష్టాక్షరం - రే)

ద్వాఃస్థైరుత్థాయ విజయం పృష్టస్తైః సహితో యయౌ .. 6..

అయోధ్యా కాండే ఏకోనశతతమే సర్గే -2-99-25

ఉటజే రామమాసీనం జటామండలధారిణం .  (అత్రప్రథమే పాదే సప్తమాక్షరం - ణ)

తం తు కృష్ణాజినధరం చీరవల్కలవాససం .. 7..

ఆరణ్య కాండే ద్వాదశే సర్గే 3 -12-4

తే వయం వనమత్యుగ్రం ప్రవిష్టాః పితృశాసనాత్ .  (అత్రాష్టమాక్షరం - యం)

ద్రష్టుమిచ్ఛామహే సర్వే భగవంతం నివేద్యతాం .. 8..

ఆరణ్య కాండే సప్తచత్వారింశే సర్గే 3-47-10

మమ భర్తా మహాతేజా వయసా పంచవింశకః .  (అత్రనవమాక్షరం - భ)

అష్టాదశ హి వర్షాణి మమ జన్మ న గణ్యతే .. 9..

శ్రీమత్కిష్కింధా కాండే చతుర్థే సర్గే 4-4-3

తతః పరమసంహృష్టో హనుమాన్ ప్లవగర్షభః .  (అత్ర దశమాక్షరం -గ)

ప్రత్యువాచ తతో వాక్యం రామం వాక్యవిశారదః .. 10..

శ్రీమత్కిష్కింధా కాండే ఏకత్రింశే సర్గే 4-31-1

సకామినం దీనమదీనసత్త్వం శోకాభిపన్నం సముదీర్ణకోపం .  (అత్ర గాయత్ర్యా ఏకాదశాక్షరం - దే)

నరేంద్రసూనుర్నరదేవపుత్రం రామానుజః పూర్వజమిత్యువాచ .. 11..

శ్రీమత్సుందరకాండే ప్రథమసర్గాదౌ 5-1-1

తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః .  (అత్రగాయత్ర్యా ద్వాదశాక్షరం- వ)

ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి .. 12..

శ్రీమత్సుందరకాండే సప్తవింశే సర్గే త్రిజటాస్వప్నే 5-27-13

తతస్తస్య నగస్యాగ్రే ఆకాశస్థస్య దంతినః .  (అత్రగాయత్ర్యా త్రయోదశాక్షరం - స్య)

భర్త్రా పరిగృహీతస్య జానకీ స్కంధమాశ్రితా .. 13..

శ్రీమత్సుందరకాండే షట్చత్వారింశే సర్గే 5-46-10

నావమాన్యో భవద్భిశ్చ హరిర్ధీరపరాక్రమః .  (అత్రగాయత్ర్యా చతుర్దశాక్షరం - ధీ)

దృష్టా హి హరయః సర్వే మయా విపులవిక్రమాః .. 14..

శ్రీమద్యుద్ధకాండే ప్రథమసర్గాదౌ 6-1-1

శ్రుత్వా హనుమతో వాక్యం యథావదభిభాషితం .  (అత్రగాయత్ర్యా పంచదశాక్షరం -మ)

రామః ప్రీతిసమాయుక్తో వాక్యముత్తరమబ్రవీత్ .. 15..

శ్రీమద్యుద్ధకాండే అష్టావింశేసర్గే 6-28-26 -27 రావణం ప్రతి శుకః

రక్షోగణపరిక్షిప్తో రాజా హ్యేష విభీషణః .  (అత్రగాయత్ర్యా షోడశాక్షరం - హి)

శ్రీమతా రాజరాజేన లంకాయామభిషేచితః .. 16..

శ్రీమద్యుధ్దకాండే పంచాశేసర్గే నాగపాశవిమోచనసమయే 6-50-40

తేజో వీర్యం బలం చౌజ ఉత్సాహశ్చ మహాగుణాః .  (అత్రగాయత్ర్యాఃసప్తదశాక్షరం -ధీ (ధి))

ప్రదర్శనం చ బుద్ధిశ్చ స్మృతిశ్చ ద్విగుణం తయోః .. 17..

శ్రీమద్యుధ్దకాండే అష్టషష్టితమేసర్గే 6-68-1

కుంభకర్ణం హతం దృష్ట్వా రాఘవేణ మహాత్మనా .  (అత్రగాయత్ర్యాఃఅష్టాదశాక్షరం -య (యో))

రాక్షసా రాక్షసేంద్రాయ రావణాయ న్యవేదయన్ .. 18..

శ్రీమద్యుధ్దకాండే ఏకాశీతితమేసర్గే 6-81-1

విజ్ఞాయ తు మనస్తస్య రాఘవస్య మహాత్మనః .  (అత్రగాయత్ర్యాః ఏకోనవింశతితమాక్షరం- య)

సన్నివృత్యాహవాత్తస్మాత్ప్రవివేశ పురీం తదా (తతః) .. 19..

శ్రీమద్ యుధ్దకాండే ద్వాదశశతతమేసర్గే 6-112-25 (గీతాప్రేస్ 6-111-100)

మరణాంతాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనం .  (అత్రగాయత్ర్యాః వింశతితమాక్షరం -నః)

క్రియతామస్య సంస్కారో మమాప్యేష యథా తవ .. 20..

ఉత్తరశ్రీరామాయణే ప్రథమసర్గాదౌ 7-1-1

ప్రాప్తరాజ్యస్య రామస్య రాక్షసానాం వధే కృతే .  (అత్రగాయత్ర్యాఃఏకవింశాక్షరం - ప్ర)

ఆజగ్మూ ఋషయః సర్వే రాఘవం ప్రతినందితుం .. 21..

ఉత్తరశ్రీరామయణే ద్వావింశేసర్గే 7-22-7(8)

తతఃప్రాచోదయత్సూతస్తాన్హయాన్నుధిరప్రభాన్ .  (అత్ర గాయత్ర్యాః ద్వావింశాక్షరం- చో)

??tataH prAchodayatsUtastaanhayAnnuchiraprabhAn?

ప్రయయౌ భీమసన్నాదో యత్ర రక్షపతిః స్థితః .. 22..

ఉత్తరశ్రీరామాయణే ఏకచత్వారింశాదౌ 7-41-1

విసృజ్య చ మహాబాహుః ఋక్షవానరరాక్షసాన్ .  (అత్రగాయత్ర్యాః త్రయోవింశాక్షరం -ద)

భ్రాతృభిః సహితో రామః ప్రముమోద సుఖం సుఖీ .. 23..

ఉత్తరశ్రీరామాయణే షట్సప్తతిత,ఏసర్గే 7-76-27 -28

బ్రాహ్మణస్య చ ధర్మేణ త్వయా వై జీవితః సుతః .  (అత్రగాయత్ర్యాఃచతుర్వింశాక్షరం -యా)

ఉష్యతాం చైవ రజనీం సకాశే మమ రాఘవ .. 24..