SRI VENKATESHWARA SWAMI KEERTHANS SRI VENKATESHWARA SWAMI KEERTHANS

అన్నమయ్య కీర్తన తందనానా అహి

Sacred recitation and chant for invocation and blessings of SRI VENKATESHWARA SWAMI KEERTHANS.

అన్నమయ్య కీర్తన తందనానా అహి

Stotra Lyrics

అన్నమయ్య కీర్తన తందనానా అహి

రాగం: నాదనామక్రియా
ఆ: స రి1 గ3 మ1 ప ద1 ని3
అవ: ని3 ద1 ప మ1 గ3 రి1 స ని3
తాళం: ఆది

పల్లవి
బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే,
తందనాన అహి, తందనాన పురె
తందనాన భళా, తందనాన ॥ (2.5)`

చరణం 1
కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ । (2)
ఇందులో జంతుకుల మంతా ఒకటే
అందరికీ శ్రీహరే అంతరాత్మ ॥ (2)
తందనాన అహి, తందనాన పురె
తందనాన భళా, తందనాన ॥

చరణం 2
నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటు నిద్ర - అదియు నొకటే । (2)
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే
చండాలుడుండేటి సరిభూమి యొకటే ॥ (2)
తందనాన అహి, తందనాన పురె
తందనాన భళా, తందనాన

చరణం 3
అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే
ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే ।
దిన మహోరాత్రములు - తెగి ధనాఢ్యున కొకటేరణం
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు ॥

చరణం 4
కొరలి శిష్టాన్నములు తును నాక లొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే ।
పరగ దుర్గంధములపై వాయు వొకటే
వరస పరిమళముపై వాయు వొకటే ॥

చరణమ5
కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద బొలయు నెండొకటే । (2)
కడు పుణ్యులను - పాప కర్ములను సరి గావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే ॥ (2)
తందనాన అహి, తందనాన పురె
తందనాన భళా, తందనాన
బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే,
తందనాన అహి, తందనాన పురె
తందనాన భళా, తందనాన