SRI VENKATESHWARA SWAMI KEERTHANS SRI VENKATESHWARA SWAMI KEERTHANS

అన్నమయ్య కీర్తన ఎక్కువ కులజుడైన

Sacred recitation and chant for invocation and blessings of SRI VENKATESHWARA SWAMI KEERTHANS.

అన్నమయ్య కీర్తన ఎక్కువ కులజుడైన

Stotra Lyrics

అన్నమయ్య కీర్తన ఎక్కువ కులజుడైన


రాగం: సామంతం
ఆ: స రి2 గ3 మ1 ప ద3 ని3 స
అవ: స ని3 ద3 ని3 ద3 ప మ1 గ3 రి2 స
తాళం: ఆది

పల్లవి
ఎక్కువ కులజుడైన హీన కులజుడైన
నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు ॥ (2.5)

చరణం 1
వేదములు చదివియును విముఖుడై హరిభక్తి
యాదరించని సోమయాజి కంటె । (2)
ఏదియును లేని కుల హీనుడైనను విష్ణు
పాదములు సేవించు భక్తుడే ఘనుడు ॥ (1.5)
ఎక్కువ కులజుడైన హీన కులజుడైన (ప.)
నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు ॥ (ప.)

చరణం 2
పరమమగు వేదాంత పఠన దొరికియు సదా
హరి భక్తి లేని సన్యాసి కంటె । (2)
సరవి మాలిన అంత్య జాతి కులజుడైన
నరసి విష్ణుని వెదకు నాతడే ఘనుడు ॥ (1.5)
ఎక్కువ కులజుడైన హీన కులజుడైన (ప.)
నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు ॥ (ప.)

చరణం 3
వినియు చదివియును, శ్రీ విభుని దాసుడు గాక
తనువు వేపుచు నుండు తపసి కంటె । (2)
ఎనలేని తిరు వేంకటేశు ప్రసాదాన్నము
అనుభవించిన యాతడప్పుడే ఘనుడు ॥ (1.5)
ఎక్కువ కులజుడైన హీన కులజుడైన (ప.)
నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు ॥ (ప.)(2)