SRI VENKATESHWARA SWAMI KEERTHANS SRI VENKATESHWARA SWAMI KEERTHANS

అన్నమయ్య కీర్తన కొండలలో నెలకొన్న

Sacred recitation and chant for invocation and blessings of SRI VENKATESHWARA SWAMI KEERTHANS.

అన్నమయ్య కీర్తన కొండలలో నెలకొన్న

Stotra Lyrics

అన్నమయ్య కీర్తన కొండలలో నెలకొన్న

రాగం: హిందోళం (20 నటభైరవి జన్య)
ఆ: స గ2 మ1 ద1 ని2 స
అవ: స ని2 ద1 మ1 గ2 స
తాళం: ఆది

పల్లవి
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు ॥ (2.5)

చరణం 1
కుమ్మర దాసుడైన కురువరతి నంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు । (1)
దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు ॥ (2.5)
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు (ప.)
కొండలంత వరములు గుప్పెడు వాడు ॥ (ప.)(2.5)

చరణం 2
అచ్చపు వేడుకతోడ ననంతాళ్వారుకి
ముచ్చిలి వెట్టికి మన్ని మోసినవాడు ।
మచ్చిక దొలక తిరునంబి తోడుత
నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చినవాడు ॥

చరణం 3
కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద
కరుణించి తన యెడకు రప్పించిన వాడు । (2)
యెంచి ఎక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించిన వాడు ॥ (2.5)
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు (ప.)
కొండలంత వరములు గుప్పెడు వాడు (ప.) (2.5)