SRI VENKATESHWARA SWAMI KEERTHANS SRI VENKATESHWARA SWAMI KEERTHANS

అన్నమయ్య కీర్తన జో అచ్యుతానంద

Sacred recitation and chant for invocation and blessings of SRI VENKATESHWARA SWAMI KEERTHANS.

అన్నమయ్య కీర్తన జో అచ్యుతానంద

Stotra Lyrics

అన్నమయ్య కీర్తన జో అచ్యుతానంద


రాగం: కాపి
ఆ: స రి2 మ1 ప ని3 స
అవ: స ని2 ద2 ని2 ప మ1 గ2 రి2 స
తాళం: ఆది

పల్లవి
(రాగం: కేదార)
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవిందా ॥ (2.5)
జో జో (2)

చరణం 1
అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా । (2)
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార ॥ (1)
జో జో ॥ (2)

చరణం 2
(రాగం: సురటి)
ఆ: స గ3 రి2 గ3 మ1 ప ద2 ని2 ద2 ప స
అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స

గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి ।
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి ॥

చరణం 3
నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ ।
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ ॥

చరణం 4
(రాగం: బిలహరి)
ఆ: స రి2 గ3 ప ద2 స
అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స

పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు ।
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు ॥

చరణం 5
(రాగం: ధన్యాసి)
ఆ: స గ2 మ1 ప ని2 స
అవ: స ని2 ద1 ప మ1 గ2 రి1 స

అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే ।
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే ॥

చరణం 6
(రాగం: శన్కరాభరణ)
ఆ: స రి2 గ3 మ1 ప ద2 ని3 స
అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స

గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి ।
చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి ॥

చరణం 7
(రాగం: ఖరహరప్రియా)
ఆ: స రి2 గ2 మ1 ప ద2 ని2 స
అవ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స

రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను ।
మాపుగానే వచ్చి మా మానములను
నీ పాపడే చెఱిచె నేమందుమమ్మ ॥

చరణం 8
(రాగం: కాంభోజి)
ఆ: స రి2 గ3 మ1 ప ద2 స
అవ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స ని3 ప ద2 స

ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి ।
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి ॥

చరణం 9
అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి ।
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి ॥

చరణం 10
(రాగం: సురటి)
ఆ: స రి2 మ1 ప ని2 స
అవ: స ని2 ద2 ప మ1 గ3 ప మ1 రి2 స

హంగుగా తాళ్ళపాకన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పె నీ జోల । (2)
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల ॥ (1)
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవిందా ॥ (ప.) (2.5)
జో జో ॥ (4)