SRI VENKATESHWARA SWAMI KEERTHANS SRI VENKATESHWARA SWAMI KEERTHANS

అన్నమయ్య కీర్తన చాలదా బ్రహ్మమిది

Sacred recitation and chant for invocation and blessings of SRI VENKATESHWARA SWAMI KEERTHANS.

అన్నమయ్య కీర్తన చాలదా బ్రహ్మమిది

Stotra Lyrics

అన్నమయ్య కీర్తన చాలదా బ్రహ్మమిది

రాగం: సింధుభైరవి
ఆ: స రి2 గ2 మ1 గ2 ప ద1 ని2 స
అవ: ని2 ద1 ప మ1 గ2 రి1 స ని2 స
తాళం: ఖండచాపు

పల్లవి
చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు ।
జాలెల్ల నడగించు సంకీర్తనం ॥ (2)

చరణం 1
సంతోష కరమైన సంకీర్తనం ।
సంతాప మణగించు సంకీర్తనం । (2)
జంతువుల రక్షించు సంకీర్తనం ।
సంతతము దలచుడీ సంకీర్తనం ॥
చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు..(ప..)

చరణం 2
సామజము గాంచినది సంకీర్తనం ।
సామమున కెక్కుడీ సంకీర్తనం ।
సామీప్య మిందరికి సంకీర్తనం ।
సామాన్యమా విష్ణు సంకీర్తనం ॥
చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు..(ప..)

చరణం 3
జముబారి విడిపించు సంకీర్తనం ।
సమ బుద్ధి వొడమించు సంకీర్తనం ।
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం ।
శమదమాదుల జేయు సంకీర్తనం ॥

చరణం 4
జలజాసనుని నోరి సంకీర్తనం ।
చలిగొండ సుతదలచు సంకీర్తనం ।
చలువ గడు నాలుకకు సంకీర్తనం ।
చలపట్టి తలచుడీ సంకీర్తనం ॥

చరణం 5
సరవి సంపదలిచ్చు సంకీర్తనం ।
సరిలేని దిదియపో సంకీర్తనం ।
సరుస వేంకట విభుని సంకీర్తనం ।
సరుగనను దలచుడీ సంకీర్తనం ॥

చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు
జాలెల్ల నడగించు సంకీర్తనం ॥ (2)