SRI VENKATESHWARA SWAMI KEERTHANS SRI VENKATESHWARA SWAMI KEERTHANS

అన్నమయ్య కీర్తన చాలదా హరి నామ

Sacred recitation and chant for invocation and blessings of SRI VENKATESHWARA SWAMI KEERTHANS.

అన్నమయ్య కీర్తన చాలదా హరి నామ

Stotra Lyrics

అన్నమయ్య కీర్తన చాలదా హరి నామ


రాగం: హంసధ్వని
29 ధీర శన్కరాభరణం జన్య
ఆ: స రి2 గ3 ప ని3 స
అవ: స ని3 ప గ3 రి2 స
తాళం: ఆది / కండ చాపు

పల్లవి
చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు ।
చాలదా హితవైన చవులెల్లను నొసగ ॥ (3)

చరణం 1
ఇది యొకటి హరి నామ మింతైన జాలదా
చెదరకీ జన్మముల చెరలు విడిపించ । (2)
మదినొకటె హరినామ మంత్రమది చాలదా । (2)
పదివేల నరక కూపముల వెడలించ ॥

చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు ।
చాలదా హితవైన చవులెల్లను నొసగ ॥

చరణం 2
కలదొకటి హరినామ కనకాద్రి చాలదా ।
తొలగుమని దారిద్ర్యదోషంబు చెరుచ ।
తెలివొకటి హరినామదీప మది చాలదా ।
కలుషంపు కఠిన చీకటి పారద్రోల ॥

చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు ।
చాలదా హితవైన చవులెల్లను నొసగ ॥

చరణం 3
తగువేంకటేశు కీర్తనమొకటి చాలదా ।
జగములో కల్పభూజంబు వలె నుండ । (2)
సొగసి యీవిభుని దాసుల కరుణ చాలదా । (2)
నగవు జూపులను నున్నతమెపుడు జూప ॥

చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు ।
చాలదా హితవైన చవులెల్లను నొసగ ॥ (2)

గోవింద హరి జయ గోపాల హరి జయ ...