SRI VENKATESHWARA SWAMI KEERTHANS SRI VENKATESHWARA SWAMI KEERTHANS

అన్నమయ్య కీర్తన దేవ దేవం భజే

Sacred recitation and chant for invocation and blessings of SRI VENKATESHWARA SWAMI KEERTHANS.

అన్నమయ్య కీర్తన దేవ దేవం భజే

Stotra Lyrics

అన్నమయ్య కీర్తన దేవ దేవం భజే


రాగం: హంసధ్వని / ధన్నాసి
22 ఖరహరప్రియ జన్య
ఆ: స గ2 మ1 ప ని2 ప స
అవ: స ని2 ప మ1 గ2 స
తాళం: ఆది

పల్లవి
దేవ దేవం భజే దివ్యప్రభావం ।
రావణాసురవైరి రణపుంగవం ॥ (2.5)

చరణం 1
రాజవరశేఖరం రవికులసుధాకరం (2)
ఆజానుబాహు నీలాభ్రకాయం । (2)
రాజారి కోదండ రాజ దీక్షాగురుం (2)
రాజీవలోచనం రామచంద్రం ॥ (2)
దేవ దేవం భజే దివ్యప్రభావం .. (2.5) (ప)

చరణం 2
నీలజీమూత సన్నిభశరీరం ఘన (2)
విశాలవక్షం విమల జలజనాభం । (2)
తాలాహినగహరం ధర్మసంస్థాపనం (2)
భూలలనాధిపం భోగిశయనం ॥ (2)
దేవ దేవం భజే దివ్యప్రభావం .. (2.5) (ప)

చరణం 3
పంకజాసనవినుత పరమనారాయణం (2)
శంకరార్జిత జనక చాపదళనం । (2)
లంకా విశోషణం లాలితవిభీషణం (2)
వెంకటేశం సాధు విబుధ వినుతం ॥(2)
దేవ దేవం భజే దివ్యప్రభావం .. (2.5) (ప)