SRI VENKATESHWARA SWAMI KEERTHANS SRI VENKATESHWARA SWAMI KEERTHANS

అన్నమయ్య కీర్తన కామధేనువిదే

Sacred recitation and chant for invocation and blessings of SRI VENKATESHWARA SWAMI KEERTHANS.

అన్నమయ్య కీర్తన కామధేనువిదే

Stotra Lyrics

అన్నమయ్య కీర్తన కామధేనువిదే


కామధేను విదే కల్పవృక్ష మిదే
ప్రామాణ్యము గల ప్రపన్నులకు ॥

హరినామజపమే ఆభరణంబులు
పరమాత్మునినుతి పరిమళము ।
దరణిదరు పాదసేవే భోగము
పరమంబెరిగిన ప్రపన్నులకు ॥

దేవుని ధ్యానము దివ్యాన్నంబులు
శ్రీవిభు భక్తే జీవనము ।
ఆవిష్ణు కైంకర్యమే సంసారము
పావనులగు యీ ప్రపన్నులకు ॥

యేపున శ్రీవేంకటేశుడే సర్వము
దాపై యితని వందనమే విధి ।
కాపుగ శరణాగతులే చుట్టాలు
పై పయి గెలిచిన ప్రపన్నులకు ॥