SRI VENKATESHWARA SWAMI KEERTHANS SRI VENKATESHWARA SWAMI KEERTHANS

అన్నమయ్య కీర్తన విన్నపాలు వినవలె

Sacred recitation and chant for invocation and blessings of SRI VENKATESHWARA SWAMI KEERTHANS.

అన్నమయ్య కీర్తన విన్నపాలు వినవలె

Stotra Lyrics

అన్నమయ్య కీర్తన విన్నపాలు వినవలె


రాగం: భూపాళ / భూపాళం
ఆ: స రి1 గ2 ప ద1 స
అవ: స ద1 ప గ2 రి1 స
తాళం: ఝంప

పల్లవి
విన్నపాలు వినవలె వింత వింతలు ।
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ॥ (1.5)

చరణం 1
తెల్లవారె జామెక్కె దేవతలు మునులు ।
అల్లనల్ల నంతనింత నదిగోవారే । (2)
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు ।
మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా ॥ (1.5)

విన్నపాలు వినవలె వింత వింతలు ।
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ॥ (1.5)

చరణం 2
గరుడ కిన్నరయక్ష కామినులు గములై ।
విరహపు గీతముల వింతాలాపాల । (2)
పరిపరివిధముల బాడేరు నిన్నదివో ।
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా ॥ (1.5)

విన్నపాలు వినవలె వింత వింతలు ।
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ॥ (1.5)

చరణం 3
పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు ।
పంకజభవాదులు నీ పాదాలు చేరి । (2)
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను ।
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా ॥ (2)

విన్నపాలు వినవలె వింత వింతలు ।
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ॥ (1.5)