SRI VENKATESHWARA SWAMI KEERTHANS SRI VENKATESHWARA SWAMI KEERTHANS

అన్నమయ్య కీర్తన శ్రీమన్నారాయణ

Sacred recitation and chant for invocation and blessings of SRI VENKATESHWARA SWAMI KEERTHANS.

అన్నమయ్య కీర్తన శ్రీమన్నారాయణ

Stotra Lyrics

అన్నమయ్య కీర్తన శ్రీమన్నారాయణ

రాగం:బొవ్ళి (15 మాయమాళవ గొవ్ళ జన్య)
ఆ: స రి1 గ3 ప ద1 స
అవ: స ని3 ద1 ప గ3 రి1 స
తాళం: ఆది

పల్లవి
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ।
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ॥

చరణం 1
కమలాసతీ ముఖకమల కమలహిత ।
కమలప్రియ కమలేక్షణ ।
కమలాసనహిత గరుడగమన శ్రీ ।
కమలనాభ నీపదకమలమే శరణు ॥
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ..(ప..)

చరణం 2
పరమయోగిజన భాగధేయ శ్రీ ।
పరమపూరుష పరాత్పర
పరమాత్మ పరమాణురూప శ్రీ ।
తిరువేంకటగిరి దేవ శరణు ॥
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ।
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ॥