SRI VENKATESHWARA SWAMI KEERTHANS SRI VENKATESHWARA SWAMI KEERTHANS

అన్నమయ్య కీర్తన సర్వాంతరాత్ముడవు

Sacred recitation and chant for invocation and blessings of SRI VENKATESHWARA SWAMI KEERTHANS.

అన్నమయ్య కీర్తన సర్వాంతరాత్ముడవు

Stotra Lyrics

అన్నమయ్య కీర్తన సర్వాంతరాత్ముడవు


రాగం: కానడ
ఆ: స రి2 గ2 మ1 ద ని2 స
అవ: స ని2 ప మ1 గ2 మ1 రి2 స

రాగం: లలితా
ఆ: స రి1 గ3 మ1 ద1 ని3 స
అవ: స ని3 ద1 మ1 గ3 రి1 స

తాళం: ట్/ఆది
పల్లవి
సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను ।
సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను । (2.5)

చరణం 1
వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతంత్రమిచ్చి ।
కోరేటియపరాధాలు కొన్ని వేసి । (2)
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ ।
దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా ॥ (2)

సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను ।
సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ॥

చరణం 2
మనసు చూడవలసి మాయలు నీవే కప్పి ।
జనులకు విషయాలు చవులుచూపి । (2)
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి ।
ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా ॥ (2)

సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను ।
సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ॥

చరణం 3
వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే ।
కన్నకన్న భ్రమతలే కల్పించి । (2)
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె ।
నిన్ను నన్ను నెంచుకుంటే నీకే తెలియునయ్యా ॥ (2)

సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను ।
సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ॥ (2)