SRI VENKATESHWARA SWAMI KEERTHANS SRI VENKATESHWARA SWAMI KEERTHANS

అన్నమయ్య కీర్తన పలుకు తేనెల తల్లి

Sacred recitation and chant for invocation and blessings of SRI VENKATESHWARA SWAMI KEERTHANS.

అన్నమయ్య కీర్తన పలుకు తేనెల తల్లి

Stotra Lyrics

అన్నమయ్య కీర్తన పలుకు తేనెల తల్లి

రాగం: సాళంగనాట /కర్నాటక దేవగాంధారి
28 హరికాంభోజి జన్య
ఆ: స గ3 మ1 ప ని2 స
అవ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స
తాళం: ఖండ చాపు

పల్లవి
పలుకు దేనెల తల్లి పవళించెను ।
కలికి తనముల విభుని గలసినది గాన ॥ (ప)(2.5)

చరణం 1
నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
పగలైన దాక జెలి పవళించెను । (2)
తెగని పరిణతులతో తెల్లవారినదాక (2)
జగదేక పతి మనసు జట్టి గొనె గాన ॥
పలుకు దేనెల తల్లి పవళించెను (ప..)

చరణం 2
కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి
బంగారు మేడపై బవళించెను । (2)
చెంగలువ కనుగొనల సింగారములు దొలక (2)
అంగజ గురునితోడ నలసినదిగాన ॥
పలుకు దేనెల తల్లి పవళించెను (ప..)

చరణం 3
నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున దరుణి పవళించెను । (2)
తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసి (2)
అరవిరై నును జెమలు నంటినదిగాన ॥
పలుకు దేనెల తల్లి పవళించెను ।
కలికి తనముల విభుని గలసినది గాన ॥ (ప)(2.5)