SRI VENKATESHWARA SWAMI KEERTHANS SRI VENKATESHWARA SWAMI KEERTHANS

అన్నమయ్య కీర్తన నిముషమెడతెగక

Sacred recitation and chant for invocation and blessings of SRI VENKATESHWARA SWAMI KEERTHANS.

అన్నమయ్య కీర్తన నిముషమెడతెగక

Stotra Lyrics

అన్నమయ్య కీర్తన నిముషమెడతెగక


రాగం: సోభనాలు
ఆ: స గ1 రి1 గ1 మ2 ప ద1 ని3 స
అవ: స ని3 ద1 ప మ2 గ1 రి1 స
తాళం: ఆది

పల్లవి
నిముషమెడతెగక హరి నిన్ను తలచి ।
మమత నీ మీదనే మరపి బ్రతుకుటగాక ॥

చరణం 1
నిదురచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు
మిమిచే కొన్నాళ్ళు మోసపోయి । (2)
కదిసి కోరినను గతకాలంబు వచ్చునే (2)
మది మదినె యుండి ఏమరక బతుకుట గాక ॥ (2)
నిముషమెడతెగక హరి నిన్ను తలచి.. (ప..)

చరణం 2
కడు తనయులకు కొంత కాంతలకు నొక కొంత
వెడయాసలకు కొంత వెట్టిసేసి । (2)
అడరి కావలెననిన అందు సుఖమున్నదా (2)
చెడక నీ సేవలే సేసి బతుకుటగాక ॥ (2)
నిముషమెడతెగక హరి నిన్ను తలచి.. (ప..)

చరణం 3
ధనము వెంట తగిలి ధాన్యంబునకు తగిలి
తనవారి తగిలి కాతరుడైనను । (2)
కను కలిగి శ్రీ వేంకటనాథ కాతువే (2)
కొనసాగి నిన్నునే కొలిచి బతుకుటగాక ॥ (2)
నిముషమెడతెగక హరి నిన్ను తలచి ।
మమత నీ మీదనే మరపి బ్రతుకుటగాక ॥