SRI VENKATESHWARA SWAMI KEERTHANS SRI VENKATESHWARA SWAMI KEERTHANS

అన్నమయ్య కీర్తన నల్లని మేని

Sacred recitation and chant for invocation and blessings of SRI VENKATESHWARA SWAMI KEERTHANS.

అన్నమయ్య కీర్తన నల్లని మేని

Stotra Lyrics

అన్నమయ్య కీర్తన నల్లని మేని


రాగం: పూర్వి కల్యాణి
(53 గమనశ్రమ జన్య)
ఆ: స రి1 గ3 మ2 ప ద2 ప స
అవ: స ని3 ద2 ప మ2 గ3 రి1 స
తాళం: ఆది

పల్లవి
నల్లని మేని నగవు చూపుల వాడు ।
తెల్లని కన్నుల దేవుడు ॥ (2.5)

చరణం 1
బిరుసైన దనుజుల పింఛమణచినట్టి ।
తిరుపు కైదువ తోడి దేవుడు । (2)
సరిపడ్డ జగమెల్ల చక్క ఛాయకు దెచ్చి । (2+1)
తెరవు చూపినట్టి దేవుడు ॥ (1+1)
నల్లని మేని నగవు చూపుల వాడు..(ప..)

చరణం 2
నీటగలసినట్టి నిండిన చదువులు ।
తేట పరచినట్టి దేవుడు । (2)
పాటిమాలినట్టి ప్రాణుల దురితపు । (2+1)
తీట రాసినట్టి దేవుడు ॥ (1+1)
నల్లని మేని నగవు చూపుల వాడు..(ప..)

చరణం 3
గురుతువెట్టగరాని గుణముల నెలకొన్న ।
తిరువేంకటాద్రిపై దేవుడు । (2)
తిరముగ ధృవునికి దివ్యపదంబిచ్చి । (2+1)
తెరచి రాజన్నట్టి దేవుడు ॥ (1+1)
నల్లని మేని నగవు చూపుల వాడు ।
తెల్లని కన్నుల దేవుడు ॥ (1.5)