PARVATHI PARVATHI

పార్వతీపంచకం

Sacred recitation and chant for invocation and blessings of PARVATHI.

పార్వతీపంచకం

Stotra Lyrics

పార్వతీపంచకం

శ్రీగణేశాయ నమః .

వినోదమోదమోదితా దయోదయోజ్జ్వలాంతరా

నిశుంభశుంభదంభదారణే సుదారుణాఽరుణా .

అఖండగండదండముండమండలీవిమండితా

ప్రచండచండరశ్మిరశ్మిరాశిశోభితా శివా .. 1..

      అమందనందినందినీ ధరాధరేంద్రనందినీ

      ప్రతీర్ణశీర్ణతారిణీ సదార్యకార్యకారిణీ .

      తదంధకాంతకాంతకప్రియేశకాంతకాంతకా

      మురారికామచారికామమారిధారిణీ శివా .. 2..

అశేషవేషశూన్యదేశభర్తృకేశశోభితా

గణేశదేవతేశశేషనిర్నిమేషవీక్షితా .

జితస్వశింజితాఽలికుంజపుంజమంజుగుంజితా

సమస్తమస్తకస్థితా నిరస్తకామకస్తవా .. 3..

      ససంభ్రమం భ్రమం భ్రమం భ్రమంతి మూఢమానవా

      ముధాఽబుధాః సుధాం విహాయ ధావమానమానసాః .

      అధీనదీనహీనవారిహీనమీనజీవనా

      దదాతు శంప్రదాఽనిశం వశంవదార్థమాశిషం .. 4..

విలోలలోచనాంచితోచితైశ్చితా సదా గుణైర్-

అపాస్యదాస్యమేవమాస్యహాస్యలాస్యకారిణీ  ..

నిరాశ్రయాఽఽశ్రయాశ్రయేశ్వరీ సదా వరీయసీ

కరోతు శం శివాఽనిశం హి శంకరాంకశోభినీ .. 5..

ఇతి పార్వతీపంచకం సమాప్తం ..