ఓం శ్రీరంగనాయక్యై నమః . గోదాయై . విష్ణుచిత్తాత్మజాయై .
సత్యై . గోపీవేషధరాయై . దేవ్యై . భూసుతాయై . భోగశాలిన్యై .
తులసీవనసంజాతాయై . (తులసీకాననోద్భుతాయై) శ్రీధన్విపురవాసిన్యై .
శ్రీభట్టనాథప్రియకర్యై . శ్రీకృష్ణహితభోగిన్యై . ఆముక్తమాల్యదాయై .
బాలాయై . శ్రీరంగనాథప్రియాయై . పరాయై . విశ్వంభరాయై . కలాలాపాయై .
యతిరాజసహోదర్యై . శ్రీకృష్ణానురక్తాయై నమః .. 20..
ఓం సుభగాయై నమః . సులభశ్రియై . శ్రీసులక్షణాయై .
లక్ష్మీప్రియసఖ్యై . శ్యామాయై . దయాంచితదృగంచలాయై .
ఫాల్గున్యావిర్భవాయై . రమ్యాయై . ధనుర్మాసకృతవ్రతాయై .
చంపకాశోకపున్నాగమాలతీవిలసత్కచాయై . ఆకారత్రయసంపన్నాయై .
నారాయణపదాశ్రితాయై . శ్రీమదష్టాక్షరమంత్రరాజస్థితమనోధరాయై .
(మనోరథాయై) మోక్షప్రదాననిపుణాయై . మనురాజాధిదేవతాయై .
(మనురత్నాధిదేవతాయై) బ్రహ్మాణ్యై . లోకజనన్యై . లీలామానుషరూపిణ్యై .
బ్రహ్మజ్ఞానప్రదాయై . మాయాయై నమః .. 40..
ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః . మహాపతివ్రతాయై .
విష్ణుగుణకీర్తనలోలుపాయై . ప్రపన్నార్తిహరాయై . నిత్యాయై .
వేదసౌధవిహారిణ్యై . శ్రీరంగనాథమాణిక్యమంజరీమంజుభాషిణ్యై .
పద్మప్రియాయై . పద్మహస్తాయై . వేదాంతద్వయబోధిన్యై . సుప్రసన్నాయై .
భగవత్యై . శ్రీజనార్దనజీవికాయై . (జనార్దనదీపికాయై)
సుగంధావయవాయై . చారురంగమంగలదీపికాయై .
ధ్వజవజ్రాంకుశాబ్జమాలతిమృదుపాదతలంఛితాయై .
(కుశాబ్జాంక) తారకాకారనఖరాయై . ప్రవాలమృదులాంగుల్యై .
కూర్మోపమేయపాదోర్ధ్వభాగాయై . శోభనపార్ష్ణికాయై .
వేదార్థభావతత్త్వజ్ఞాయై నమః .. 60..
ఓం లోకారాధ్యాంఘ్రిపంకజాయై నమః . ఆనందబుద్బుదాకారసుగుల్ఫాయై .
పరమాంశకాయై . (పరమాణుకాయై) అతులప్రతిమాభాస్వదంగులీయకభూషితాయై .
(తేజఃశ్రియోజ్జ్వలధృతపాదాంగులిసుభూషితాయై)
మీనకేతనతూణీరచారుజంఘావిరాజితాయై . కుబ్జజానుద్వయాఢ్యాయై .
(కకుద్వజ్జానుయుగ్మాఢ్యాయై) స్వరరంభాభశక్తికాయై .
(స్వర్ణరంభాభసక్థికాయై) విశాలజఘనాయై . పీతసుశ్రోణ్యై .
మణిమేఖలాయై . ఆనందసాగరావర్తగంభీరాంభోజనాభికాయై .
భాస్వద్బలిత్రికాయై . చారుపూర్ణలావణ్యసంయుతాయై .
(చారుజగత్పూర్ణమహోదర్యై) నవరోమావలిరాజ్యై .
(నవవల్లీరోమరాజ్యై) సుధాకుంభస్తన్యై . కల్పమాలానిభభుజాయై .
చంద్రఖండనఖాంచితాయై . ప్రవాలాంగులివిన్యస్తమహారత్నాంగులీయకాయై .
నవారుణప్రవాలాభపాణిదేశసమంచితాయై . కంబుకంఠ్యై నమః .. 80..
ఓం సుచిబుకాయై నమః . బింబోష్ఠ్యై . కుందదంతయుజే .
కారుణ్యరసనిష్పందలోచనద్వయశాలిన్యై . (నేత్రద్వయసుశోభితాయై)
కమనీయప్రభాభాస్వచ్చాంపేయనిభనాసికాయై .
(ముక్తాశుచిస్మితాచరుచాంపేయనిభనాసికాయై)
దర్పణాకారవిపులకపోలద్వితయాంచితాయై .
అనంతార్కప్రకాశోద్యన్మణితాటంకశోభితాయై .
కోటిసూర్యాగ్నిసంకాశనానాభూషణభూషితాయై . సుగంధవదనాయై .
సుభ్రవే . అర్ధచంద్రలలాటికాయై . పూర్ణచంద్రాననాయై .
నీలకుటిలాలకశోభితాయై . సౌందర్యసీమావిలసత్కస్తూరీతిలకోజ్జ్వలాయై .
ధగద్ధగాయమానోద్యన్మణి(సీమంత) భూషణరాజితాయై .
జాజ్జ్వల్యమానసద్రత్నదివ్యచూడావతంసకాయై .
సూర్యచంద్రాదికల్యాణభూషణాంచితవేణికాయై .
(సూర్యార్ధచంద్రవిలసద్భూషణాంచితవేణికాయై)
అత్యర్కానలతేజోవన్మణికంచుకధారిణ్యై . (తేజోఽధిమణి)
సద్రత్నజాలవిద్యోతవిద్యుత్పుంజాభశాటికాయై . (సద్రత్నాంచిత)
నానామణిగణాకీర్ణకాంచనాంగదభూషితాయై నమః .. 100..
(హేమాంగదసుభూషితాయై)
ఓం కుంకుమాగురుకస్తూరిదివ్యచందనచర్చితాయై
నమః . స్వోచితోజ్జ్వలవిద్యోతవిచిత్రమణిహారిణ్యై .
పరిభాస్వద్రత్నపుంజదీప్తస్వర్ణనిచోలికాయై .
అసంఖ్యేయసుఖస్పర్శసర్వావయవభూషణాయై . (సర్వాతిశయభూషణాయై)
మల్లికాపారిజాతాదిదివ్యపుష్పశ్రియాంచితాయై . శ్రీరంగనిలయాయై .
పూజ్యాయై . దివ్యదేవీసేవితాయై నమః .. 108 (దివ్యదేశసుశోభితాయై)
ఇతి గోదాష్టోత్తరశతనామావలిః సమాప్తా .